Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ కుమారుడినని చెప్పుకుంటున్న వ్యక్తి అసలు చరిత్ర ఇది!

  • ఐశ్యర్య కుమారుడినని చెప్పుకున్న సంగీత్ కుమార్ రాయ్
  • అసలు పేరు ఆదిరెడ్డి సంగీత్ కుమార్
  • ప్రచారం కోసం ఇంత పని చేశాడు
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు తాను కుమారుడినని... 1988లో ఐవీఎఫ్ మెథడ్ లో తాను లండన్ లో జన్మించానంటూ సంగీత్ కుమార్ రాయ్ అనే యువకుడు పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. మూడేళ్ల వరకు తన అమ్మమ్మ బ్రింగ్యారాయ్ వద్ద ఉన్నానని, ఆ తర్వాత ఏపీలోని విశాఖపట్నం జిల్లా చోడవరంలో పెరిగానని అతను చెప్పాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ యువకుడికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు ఆదిరెడ్డి సంగీత్ కుమార్. అతనిది చోడవరమే. ఇతని తండ్రి ఆదిరెడ్డి మావూళ్లు ఆర్టీసీ కండక్టర్. చిన్నప్పుడు చోడవరంలో ఉన్న సంగీత్ కుమార్... ఆ తర్వాత తన తండ్రికి విశాఖకు ట్రాన్స్ ఫర్ కావడంతో అక్కడకు వెళ్లిపోయాడు. కొంతకాలం పాశ్చాత్య సంగీతంలో పాటలు పాడుతూ, యూట్యూబ్ లో వెబ్ రేడియో కూడా నడిపాడు. గత కొంత కాలంగా బెంగుళూరులో ఉంటున్నాడని సమాచారం. కేవలం ప్రచారం కోసమే ఐశ్వర్య కొడుకునని చెప్పుకున్నాడని అంటున్నారు. విశాఖలో ఎవరితో ఇతనికి పెద్దగా పరిచయం లేదు. మరోవైపు, చోడవరంలో తాను పెరిగానంటూ ఇంటర్వ్యూల్లో చెప్పడంతో... ఇప్పుడు చోడవరంలో అందరూ సంగీత్ కోసం ఆరా తీస్తున్నారు.
Aishwarya Rai
aishwarya rai son

More Telugu News