Tirumala: 31న పగటిపూటంతా తిరుమల ఆలయం మూసివేత!

  • 31న చంద్రగ్రహణం
  • సాయంత్రం 5.18కి గ్రహణ సమయం మొదలు
  • అంతకు 8 గంటల ముందుగానే గుడి మూసివేత
ఈనెల 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 వరకూ గ్రహణం ఏర్పడనుందని, గ్రహణం ప్రారంభం కావడానికి ఎనిమిది గంటల ముందుగానే ఆలయానికి తాళాలు వేయనున్నామని, రోజంతా స్వామివారి దర్శనం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

గ్రహణం విడిచిన తరువాత, ఆగమ శాస్త్ర ప్రకారం, ఆలయాన్ని శుద్ధి చేసి, పుణ్యాహవచనం తరువాత రాత్రి 10 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. ఆరోజు తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Tirumala
TTD
Sri Venkateshwara
Temple Close
Eclips

More Telugu News