Pawan Kalyan: ఎన్నారైలకు పవన్ కల్యాణ్ వీడియో సందేశం. మీరూ చూడండి

  • మీరంటే నాకెంతో గౌరవం
  • మీకు అండగా ఇక్కడ మేమున్నాం
  • కోట్ల గొంతుకలు మీకు అండగా నిలబడతాయి
'అజ్ఞాతవాసి' సినిమాతో పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తన అభిమానులకు వీడియో ద్వారా పవన్ ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు.

"ప్రవాసంలో ఉన్న తెలుగువారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరుకి వెళ్లి పని చేయడమే చాలా కష్టం. అలాంటిది రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి దేశంకాని దేశంలో చదువుకోవడం, అక్కడ పని చేయడం ఎంతో కష్టం. దీనికితోడు ఆత్మగౌరవం దెబ్బ తినకుండా అక్కడ జీవితాన్ని ఏర్పరుచుకోవడం, స్థానికతను సంపాదించుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరెక్కడున్నా మీ వెనుక, మీతోపాటు మేమున్నాం. అక్కడ మీకు ఏ చిన్న సమస్య ఎదురైనా... ఇక్కడ కొన్ని కోట్ల గొంతుకలు మీకు అండగా నిలబడతాయి.

సరిగ్గా 18 సంవత్సరాల క్రితం 'బద్రీ' సినిమా అమెరికాలో కేవలం కొద్దిపాటి సెంటర్లలో విడుదల కాగానే అది పెద్ద విజయంగా నాకు చెప్పారు. అలాంటిది ఇప్పుడు 'అజ్ఞాతవాసి' చిత్రానికి ఏ భారతీయ సినిమాకు ఇవ్వనంత గొప్పగా భారీ విడుదలను ఇస్తున్నందుకు నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. మీరు చూపించే ప్రేమకు, గౌరవానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా" అంటూ వీడియోలో పవన్ చెప్పారు.
Pawan Kalyan
agnathavasi
pawan video message

More Telugu News