tollywood: ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలనిపించింది: సినీ మహిళా గీత రచయిత శ్రేష్ఠ

  • టాలీవుడ్ లో మరో కోణం
  • కొత్తగా వచ్చిన మహిళలపై మహిళల వేధింపులు
  • బయటపెట్టిన పాటల రచయిత్రి శ్రేష్ఠ
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాము కూడా వేధింపులకు లోనయ్యామంటూ పలువురు హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి, పాప్యులర్ అయిన మహిళా గేయ రచయిత శ్రేష్ఠ కూడా చేరారు. తాను కూడా పరిశ్రమలో వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపారు.

గోవాలో జరిగిన ఓ పార్టీకి రావాలంటూ తనను ఓ దర్శకురాలు బలవంతం చేసిందని... అక్కడ తనకు ఓ వ్యక్తిని పరిచయం చేసి, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందని శ్రేష్ఠ అన్నారు. అయితే, అదే వ్యక్తి తనకు ఫోన్ చేసి సదరు దర్శకురాలు నీ గురించి మరోలా చెప్పిందంటూ చీప్ గా మాట్లాడాడని... ఆ ఘటనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలని తనకు అనిపించిందని అన్నారు. సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చినవారిని వేధింపులకు గురి చేసే వారిలో మహిళలు కూడా ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
tollywood
shresta
lyricist shresta

More Telugu News