Prabhas: ప్రభాస్ అందుకే అమెరికా వెళ్లాడట!

  • ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ 
  • అమెరికా డాక్టర్స్ సూచనలు 
  • తదుపరి షెడ్యూల్ దుబాయ్ లో
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది. ప్రస్తుతం అందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేయవలసి వుంది. రిస్కీ ఫైట్స్ లో పాల్గొనవలసి వుంది.

 అయితే 'బాహుబలి' సినిమా సమయంలో ప్రభాస్ భుజానికి అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. మళ్లీ ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంపై డాక్టర్స్ ను సంప్రదించడానికి ఆయన అమెరికా వెళ్లినట్టు చెబుతున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, అక్కడి డాక్టర్ల సలహాలు .. సూచనలు తీసుకున్నాడని అంటున్నారు. అక్కడి నుంచి ప్రభాస్ తిరిగి రాగానే ఈ సినిమా టీమ్ 'దుబాయ్' వెళ్లనుంది. భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరించనున్నారు.      
Prabhas
shraddha

More Telugu News