medaram jathara: హైదరాబాద్ టు మేడారం.. హెలికాప్టర్ సర్వీస్

  • 21వ తేదీ నుంచి మేడారం జాతర
  • హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలు
  • వెంకయ్యను ఆహ్వానించిన టీఎస్ ప్రభుత్వం
ఈ నెల 21వ తేదీ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మేడారం జాతరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించామని చెప్పారు. అలాగే, జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కోరామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం నుంచి రూ. 80 కోట్లను కేటాయించామని తెలిపారు. 
medaram jathara
Venkaiah Naidu

More Telugu News