Congress: ‘పోలవరం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న ఏపీసీసీ

  • ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు పాదయాత్ర
  • రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు
  • విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెల్లడి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా పోలవరం పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేసిన ఆకుల శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, 2014లో జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ఆరువందల హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు వాటిని అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయవాడ న‌గ‌రం ట్రాఫిక్ మ‌యంగా మా‌రిందని.. దుర్గ‌గుడి వ‌ద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ త్వరగా పూర్తి చేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు.  
Congress
Andhra Pradesh

More Telugu News