Donald Trump: నిజాయతీ లేని, చెత్త రిపోర్టింగ్‌ల ఆధారంగా మీడియా సంస్థలకు అవార్డులు ప్రకటిస్తాను: డొనాల్డ్ ట్రంప్‌

  • ఈ ఏడాదికి నిజాయతీ లేని, అవినీతి మీడియా అవార్డులు ఇస్తాను
  • వ‌చ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటన
  • మీడియా సంస్థలకు షాక్‌ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మీడియా అంటే ఎంత చిరాకో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఫేక్ మీడియా అంటూ, అన్నీ అస‌త్యాలే తెలుపుతుందంటూ ఆయ‌న చాలాసార్లు ట్విట్ట‌ర్ ద్వారా మీడియా మీద దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎన్‌ఎన్‌, ఏబీసీ న్యూస్‌, న్యూయార్క్‌ టైమ్స్ వంటి మీడియా సంస్థలపై ఆయ‌న త‌రుచూ విరుచుకుప‌డ‌తారు.

ఇక ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేస్తూ.. ఈ ఏడాది నిజాయతీ లేని, అవినీతి మీడియా అవార్డులను తాను వ‌చ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఫేక్‌ న్యూస్‌ మీడియాలో వివిధ విభాగాల్లో నిజాయతీ లేని, చెత్త రిపోర్టింగ్‌ల ఆధారంగా ఈ అవార్డుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుపుతూ షాక్ ఇచ్చారు. 
Donald Trump
america
media awards

More Telugu News