Kodakaa: తెలుగే రాని పోలెండ్ బుడ్డోడు... 'కొడకా కోటేశ్వర్రావూ' అంటూ ఇరగదీస్తున్న వీడియో!

  • పదేళ్ల యువకుడు పాడిన పాట వైరల్
  • పవన్ కు గిఫ్ట్ అంటూ పాడిన జిబిగ్స్
  • యువర్ సాంగ్ ఎలక్టక్రిఫయ్యింగ్ అంటూ అభినందన
జిబిగ్స్... పట్టుమని పదేళ్లు ఉంటాయేమో... పోలెండ్ కు చెందిన బాలుడు. తెలుగు లాంగ్వేజ్ అన్న పేరునైనా విన్నాడో లేదో... కానీ, ఇప్పుడా కుర్రాడు నెట్టింట సెన్సేషన్. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన "కొడకా కోటేశ్వర్రావూ..." పాటను తన నోటితో ఆలపిస్తున్నాడు.

"హే పవర్ స్టార్... యువర్ 'కొడకా...'సాంగ్ ఈజ్ ఎలక్ట్రిఫయ్యింగ్. దిసీజ్ మై గిఫ్ట్ టూ యూ" అని చెప్పి... "కొడకా కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో..." అంటూ పాటందుకున్నాడు. అతను పాడిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు జిబిగ్స్ పాటకు ఫిదా అయిన పవన్ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Kodakaa
Pawan Kalyan
poland

More Telugu News