sunil: 'భలే భలే మగాడివోయ్' కథను నాకు మారుతి చెప్పలేదు: సునీల్

షార్ట్స్‌లో చూడండి
కథానాయకుడిగా కొంత కాలంగా సక్సెస్ లకు దూరమైన సునీల్, పెద్ద హీరోల సినిమాల్లో మళ్లీ కమెడియన్ గా నటించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'భలే భలే మగాడివోయ్' సినిమా కథను ముందుగా మారుతి తనకి వినిపించినట్టుగా వచ్చిన వార్తల గురించి స్పందించాడు.

 " నిజం చెప్పాలంటే మారుతి నాకు ఈ సినిమా కథ వినిపించలేదు. మొదట ఆయన నాకు వినిపించిన కథ వేరు .. అది నాకు నచ్చలేదు. ఆ తరువాత మరో కథతో ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ కథ కూడా నాకు అంతగా ఎక్కలేదు. ఆ తరువాత ఆయన 'భలే భలే మగాడివోయ్' కి సంబంధించిన పాయింట్ మాత్రమే చెప్పాడు .. మొత్తం కథ నాకు చెప్పనే లేదు. నేను చేయనని చెప్పలేదు .. ఆ తరువాత ఆయన నన్ను కలవలేదు. 'భలేభలే మగాడివోయ్' సినిమా కథను నేను తిరస్కరించాను అనే మాటలో ఎంత మాత్రం వాస్తవం లేదు" అని ఆయన చెప్పుకొచ్చాడు.        
Go Back to Shorts
sunil

More Telugu News