rakul preet singh: 'స్పైడర్' గురించి మాట్లాడాలనుకోవడం లేదు: రకుల్ ప్రీత్ సింగ్

  • మురుగదాస్ తో పని చేయడం మంచి అనుభూతి
  • అవకాశం వస్తే మరోసారి ఆయనతో చేస్తా
  • ఇంతకు మించి ఏం చెప్పలేను
మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, మురుగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే మహేష్ తో 'బ్రహ్మోత్సవం', మురుగదాస్ తో 'తుపాకి' సినిమాలను చేసే అవకాశాన్ని రకుల్ మిస్ అయింది. దీంతో, వీరిద్దరితో కలసి పని చేసే అవకాశం 'స్పైడర్' రూపంలో రావడంతో... మరో ఆలోచన లేకుండా సినిమాను ఒప్పేసుకుంది రకుల్. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపింది.

ఈ సినిమా విడుదలకు ముందు వరకు చాలా గొప్పగా మాట్లాడిన రకుల్... తాజాగా ఆ సినిమా గురించి మాట్లాడనని స్పష్టం చేసింది. తాను మాట్లాడకపోవడానికి కారణం ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదనేది కాదని చెప్పింది. 'స్పైడర్'లో నటించడం ఓ మంచి అనుభవమని... మురుగదాస్ తో పని చేయడం అదృష్టంగా భావించి ఆ సినిమా చేశానని తెలిపింది. అవకాశం వస్తే మరోసారి ఆయనతో కలసి పనిచేయడానికి తాను సిద్ధమేనని చెప్పింది. ఇంతకు మించి ఆ సినిమా గురించి మాట్లాడలేనని తెలిపింది.
rakul preet singh

More Telugu News