pawan kalyan: జనసేన పేరును భజనసేనగా మార్చుకుంటే బాగుంటుంది: బీజేపీ అధికార ప్రతినిధి

  • పవన్ కు అవగాహన లేదు
  • కేసీఆర్ ను పొగడటం అవగాహన లేమిని సూచిస్తోంది
  • పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు వీరి భేటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, జనసేన పేరును భజనసేనగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఏ మాత్రం అవగాహన లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను పొగడటం పవన్ అవగాహన లేమిని తెలియజేస్తోందని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా పవన్ పై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియాను రక్షించేందుకే కేసీఆర్ తో పవన్ భేటీ అయ్యారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
pawan kalyan
KCR
BJP
Congress
v hanumantha rao

More Telugu News