Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే 
  • దూసుకుపోతున్న 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ 
  • రజనీకాంత్ బాటలో లారెన్స్!
  • సినిమా డైరెక్టర్ గా నారా రోహిత్!
*  ప్రస్తుతం 'సాక్ష్యం' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే త్వరలో మహేశ్ బాబు సరసన నటించనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించే చిత్రంలో పూజాను కథానాయికగా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.  
*  సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఎంతో క్రేజ్ వున్న విషయం మనకు తెలుసు. ఈ క్రమంలో బన్నీ తాజా చిత్రం 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ ఓ రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో విడుదలైన 29 గంటల్లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సాధించి ఆకట్టుకుంటోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
*  తమిళనాట రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడంతో చాలా మంది ఆర్టిస్టులు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు లారెన్స్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెల 4న లారెన్స్ ప్రెస్ మీట్ పెట్టి తన రాజకీయ ప్రవేశ ప్రకటన చేయనున్నాడు.
*  నారా రోహిత్ తాజాగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటగాళ్లు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తను ఒక సినిమా డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
Pooja Hegde
Allu Arjun
Rajani
Nara Rohith

More Telugu News