Nara Lokesh: చంద్ర‌బాబు విశ్రాంతి తీసుకున్నాక లోకేశే మా నాయ‌కుడు: వ‌ర్ల రామ‌య్య‌

  • లోకేశ్ సీఎం కావ‌డానికి తాంత్రిక పూజ‌లు చేశార‌ని అంబ‌టి వ్యాఖ్య‌లు
  • తాంత్రిక పూజ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు
  • చంద్ర‌బాబు త‌రువాత లోకేశే ముఖ్య‌మంత్రి-వ‌ర్ల రామ‌య్య‌
త‌న కుమారుడు, రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాంత్రిక పూజ‌లు చేయాల్సి అవ‌స‌రం తమకు లేదని, సాధార‌ణంగానే చంద్ర‌బాబు త‌రువాత లోకేశే ముఖ్య‌మంత్రి అవుతార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు విశ్రాంతి తీసుకున్నాక లోకేశే త‌మ‌ నాయ‌కుడని వ్యాఖ్యానించారు.       
Nara Lokesh
Chandrababu
Andhra Pradesh
varla ramaiah

More Telugu News