catherine: సరదా ప్రశ్నలతో కేథరిన్ ను ఇబ్బంది పెట్టేసిన అలీ!

షార్ట్స్‌లో చూడండి
'అలీతో సరదాగా' కార్యక్రమంలో తాజాగా కేథరిన్ పాల్గొనగా, కొంటె ప్రశ్నలతో అలీ ఆమెను అయోమయంలో పడేశాడు. ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆమె ఇబ్బంది పడింది. "ఇప్పుడు ఇండస్ట్రీలో వున్న టాప్ హీరోల్లో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే, ఎవరికి అక్కగా .. ఎవరికి వదినగా .. ఎవరికి లవర్ గా చేస్తారు?" అని అలీ అడిగారు.

దాంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. ప్రభాస్ కి అక్కగా చేయాలంటే చేస్తారా? అంటే, నో అంటూ ఆమె సిగ్గుపడిపోయింది. పోనీ పవన్ కల్యాణ్ కి వదినగా చేయాలంటే చేస్తారా? అంటే .. ఇదెక్కడి ప్రశ్న అన్నట్టుగా ఆమె ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లవర్ గా ఎవరితో చేస్తారో చెప్పండి పోనీ .. అంటే, కథ .. నా పాత్ర బాగుంటే చేస్తాను అని సమాధానమిచ్చింది. కథ .. పాత్ర బాగుంటే, కొత్త దర్శకుడైనా .. కొత్త హీరోతోనైనా చేస్తావా? అంటే .. 'చూడాలి' అంటూ సమాధానాన్ని దాట వేసింది.    
Go Back to Shorts
catherine
ali

More Telugu News