gazal srinivas: గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ రేపటికి వాయిదా.. చంచల్ గూడ జైలుకి త‌ర‌లింపు

  • బెయిల్ పిటిష‌న్‌పై నాంప‌ల్లి కోర్టులో కొన‌సాగిన వాద‌న‌లు
  • యువ‌తిని వేధించాడని వీడియో, ఆడియో ఆధారాలు
  • మ‌రిన్ని ఆధారాల‌ కోసం పోలీసుల ప్ర‌య‌త్నాలు
ఓ యువ‌తిని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్‌కు నాంప‌ల్లి కోర్టు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై వాద‌న‌లు కొన‌సాగాయి. చివ‌ర‌కు కోర్టు బెయిల్ పిటిష‌న్‌ పై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకి త‌ర‌లించారు. ఆ కేసులో బాధిత యువ‌తి స‌మ‌ర్పించిన ఆధారాల‌నే కాకుండా మ‌రిన్ని ఆధారాలను సేక‌రించ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.   
gazal srinivas
bail
jail

More Telugu News