KCR: కేసీఆర్ తో పవన్ భేటీకీ, రాజకీయాలకు సంబంధం లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాను పవన్ ప్రశంసించారు
  • జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమిటో కూడా మాకు తెలియవు
  • మీడియాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రాజకీయంగా పలు వ్యాఖ్యలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అపాయింట్ మెంట్ కావాలని పవన్ కల్యాణే కోరారని అన్నారు. కేసీఆర్ తో పవన్ భేటీకీ, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడాన్ని పవన్ ప్రశంసించారని చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమిటో కూడా తమకు తెలియవని అన్నారు.
KCR
Pawan Kalyan

More Telugu News