v.hanumantha rao: డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కేసీఆర్ ను పవన్ కల్యాణ్ కలిశారు!: వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు
- రాష్ట్రపతి కార్యక్రమంలో ఇద్దరూ కలిసినప్పుడే డౌట్ వచ్చింది
- తెలంగాణ ఎందులో ఆదర్శమో పవన్ చెప్పాలి
- పవన్ కు దమ్ముంటే రైతుల వద్దకు తీసుకెళ్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశానికే తెలంగాణ ఆదర్శమని పవన్ అన్నారని... ఏ విషయంలో ఆదర్శమో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్, పవన్ లు కలసినప్పుడే తనకు డౌట్ వచ్చిందని అన్నారు.
డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కేసీఆర్ ను పవన్ కలిశారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ పెడ్లర్ కాల్విన్ పై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదో ప్రభుత్వం తెలపాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని... పవన్ కు దమ్ముంటే, తనతో వస్తే రైతుల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.