Manchu Vishnu: ఇద్దరమ్మాయిల తరువాత మంచు విష్ణుకు కొడుకు పుట్టాడు!

  • మోహన్ బాబుకు మనవడు
  • మగ బిడ్డను కన్న విష్ణు భార్య 
  • ఆనందాన్ని పంచుకున్న విష్ణు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబానికి కొత్త సంవత్సరం మరో శుభవార్తను అందించింది. ఆయన్ను మరోసారి తాతను చేస్తూ, విష్ణు భార్య వెరోనికా పండంటి బాబును ప్రసవించింది. విష్ణు, విరోనికా దంపతులకు తొలి కాన్పులో కవల ఆడపిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఇక తన భార్యకు బాబు పుట్టాడన్న విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

"ఇట్స్ ఏ బాయ్!" అని వ్యాఖ్యానించాడు. అంతకు కొన్ని గంటల ముందు మరో ట్వీట్ పెడుతూ, తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించే సమయం వచ్చిందని, విన్నీని ఇప్పుడే ఆసుపత్రికి తీసుకు వచ్చామని, తన గుండె పరిగెడుతోందని చెప్పాడు. కాగా, తన కుమార్తెలకు అరియానా, వివియానా అని పేర్లు పెట్టుకున్న విష్ణు, ఈ దఫా తనకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా ఓ పేరు సిద్ధంగానే ఉంచుకున్నానని ఇప్పటికే వెల్లడించాడు.
Manchu Vishnu
veronika
Mohan Babu

More Telugu News