Geetha madhuri: రాంగోపాల్ వర్మకు సింగర్ గీతామాధురి ఘాటు రిప్లై!

  • వర్మ న్యూ ఇయర్ విషెస్ వ్యాఖ్యలకు గీతా మాధురి కౌంటర్
  • విషెస్ శుద్ధ దండగ అన్న ఆర్జీవీ
  • డబ్బులు ఖర్చు చేస్తే ఆశించడం మొదలవుతుందున్న సింగర్
వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మకు సింగర్ గీతామాధురి కౌంటర్ ఇచ్చింది. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, ఉచితంగా మెసేజ్‌లు చెప్పడం కాకుండా డబ్బు, విలువైన వస్తువులను దానం చేయాలని వర్మ కామెంట్ చేశాడు. ఇతరుల శ్రేయస్సును కోరే వారే అయితే ఉచిత మెసేజ్‌లను మాని ఇలా చేయాలని సూచించాడు.  

ఆర్జీవీ పోస్టుకు సింగర్ గీతామాధురి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నవ్వుతూ బతకడంలో ఖర్చు లేదని, తన వరకు అయితే ప్రతి రోజూ ప్రత్యేకమైనదేనని పేర్కొంది. న్యూ ఇయర్ విషెస్ చెప్పడమంటే ఎదుటి వారిని ప్రోత్సహించడమేనని, వారిలోని అనుకూలతలను పెంచడమేనని పేర్కొంది. పైగా ఇది ఉచితమంటూ కౌంటర్ ఇచ్చింది. డబ్బులు ఖర్చు చేస్తే ఎదుటి వ్యక్తి నుంచి ఎంతోకొంత ఆశిస్తారని, ఇది తర్వాత ప్రతికూలంగా మారుతుందని పేర్కొంది.
Geetha madhuri
Singer
Ram Gopal Varma

More Telugu News