Chandrababu: అమరావతిలో పీఆర్ఎస్ఐ చాప్టర్ ను ప్రారంభించిన చంద్రబాబు

  • అమరావతిలో పీఆర్ఎస్ఐ 26వ చాప్టర్ ప్రారంభం
  • పీఆర్వోల పాత్రను కొనియాడిన చంద్రబాబు
  • ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజెప్పేందుకు చాప్టర్ కృషి చేయాలి
పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) అమరావతి చాప్టర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని తన చాంబర్ లో చాప్టర్ ఫలకం, బ్రోచర్, ఫ్లెక్సీపై ఆయన సంతకంతో ఉన్న వాటిని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో రాష్ట్ర పౌరసంబంధాల శాఖాధికారుల పాత్రను ఆయన కొనియాడారు. పీఆర్ఎస్ఐ కొత్త చాప్టర్ కూడా ఈ విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం అమరావతి పీఆర్ఎస్ఐ చైర్మన్ వీఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు 25 చాప్టర్లు ఉన్నాయని, అమరావతిలో 26వ చాప్టర్ ను ప్రారంభించామని అన్నారు. 
Chandrababu
amaravathi

More Telugu News