Jagan: ప్రజలు కొడతారనే భయంతోనే టీడీపీ మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేశారు: వైఎస్ జగన్

  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
  • ప్రతి కులాన్ని అన్ని రకాలుగా చంద్రబాబు మోసం చేశారు
  • ‘విశ్వసనీయత’కు చంద్రబాబు పాతరేశారు: జగన్
ప్రజలు కొడతారనే భయంతోనే టీడీపీ మేనిఫెస్టోను సంబంధిత వెబ్ సైట్ నుంచి తీసేశారని ఆ పార్టీ నేతలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని  ప్రశ్నించారు. ప్రతి కులాన్ని అన్ని రకాలుగా చంద్రబాబు మోసం చేశారని, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.

‘విశ్వసనీయత’ అనే పదాన్ని ఆయన మర్చిపోయారని, ఆ పదానికి చంద్రబాబు పాతరేశారని, నాయకుడు తాను ఇచ్చిన మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు. చేనేతలకు, రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, ముష్టి వేసినట్టుగా విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారని, అది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు సరిగా అందడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ ఒక అడుగు ముందుకేస్తే, తాను రెండడుగులు ముందుకేస్తానని జగన్ చెప్పారు.
Jagan
YSRCP

More Telugu News