pavan: వెంటవెంటనే ఆడియన్స్ ముందుకు కీర్తి సురేశ్

  • పవన్ జోడీగా 'అజ్ఞాతవాసి'
  • సూర్య సరసన 'గ్యాంగ్'
  • రెండూ సంక్రాంతి కనుకగానే రిలీజ్
కీర్తి సురేశ్ అదృష్టవంతురాలేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కెరియర్ ఆరంభంలోనే ఆమెకు విజయాలు దక్కాయి .. అగ్ర హీరోల సరసన అవకాశాలు లభించాయి. ఈ సంక్రాంతికి ఇటు తెలుగు ప్రేక్షకులను .. అటు తమిళ ఆడియన్స్ ను పలకరించడానికి ఆమె రెడీ అవుతుండటం విశేషం. తెలుగులో పవన్ సరసన ఆమె చేసిన 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఇక తమిళంలో సూర్య జోడీగా చేసిన 'తానా సెరిందా కూట్టమ్' జనవరి 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులో 'గ్యాంగ్' పేరుతో ఇక్కడ రిలీజ్ కానుంది. ఇలా కీర్తి సురేశ్ ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు, ఒకటి రెండు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి. 'గ్యాంగ్' సినిమాలో ఆమె పాత్రకు పేరు ఉండదట. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని కీర్తి సురేశ్ బలంగా చెబుతోంది.      
pavan
surya
keerthi suresh

More Telugu News