Kadapa: కడప జిల్లాలో ఘోరాతి ఘోరం.. చలి మంట కాచుకుంటున్న వారిపై నుంచి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
కడపలో ఘోరాతి ఘోరం జరిగింది. చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని  పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చలి కాచుకుంటున్న నలుగురితోపాటు కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

కారు వేంపల్లి నుంచి కడపవైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ప్రమాదంలో ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ ‌(14), గిరి (15), భాస్కర్‌ (26) మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kadapa
Accident
Andhra Pradesh

More Telugu News