nani: నేను నటుడిని అవుతానని మొదట చెప్పింది స్నేహ తల్లి!: హీరో నాని

షార్ట్స్‌లో చూడండి
తాను నటుడిని అవుతానని మొదట చెప్పింది నటి స్నేహ తల్లి అని హీరో నాని అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినీ రంగంలో తన కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించానని, బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాళం’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని చెప్పారు.

ఆ సమయంలో నటి స్నేహ తల్లి తనను చూసి నటుడిని అవుతానని అంటుండేవారని, అయితే ఆవిడ సరదాగా అంటున్నారని అనుకునేవాడినని, ఆ తర్వాత నిజంగానే తాను నటుడిని అయ్యానని చెప్పాడు. బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను చేరినప్పుడు, తనకేమీ తెలియదని, ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. అలాంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేసే అవకాశం తనకు మొట్టమొదట్లోనే లభించడం మరువలేని విషయమని నాటి విషయాలను నాని గుర్తుచేసుకున్నారు.
Go Back to Shorts
nani
cinema

More Telugu News