Pawan Kalyan: ‘జనసేన’ సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ప్రారంభం
  • తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన పవన్
  • రెండు రాష్ట్రాలలో త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ
‘జనసేన’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని పార్టీ పరిపాలనా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు. అనంతరం, తమ పార్టీలోని ముఖ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు రాష్ట్రాలలో త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 గత పదేళ్లుగా తనను అనుసరిస్తున్న వారితో మూడు రోజులుగా పవన్ ఇష్టాగోష్ఠి సమావేశాలను నిర్వహించారని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను వారికి వివరించారని తెలిపారు. జనసేన పార్టీ శిక్షణా శిబిరాలను రానున్న రోజుల్లో నిర్వహించనున్నటు తెలిపారు. జనసేన పార్టీకి వక్తలు, కంటెంట్ రైటర్స్, అనలిస్టులు, సమన్వయకర్తలుగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిలో తొలుత మహిళలు, సీనియర్ సిటిజెన్స్ కు ఒక వర్క్ షాపు నిర్వహించాలని నిర్ణయించామని, కొత్త సంవత్సరం తొలి రోజుల్లో ఈ వర్క్ షాపును హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
Pawan Kalyan
jena sena

More Telugu News