rajani kanth: రాజకీయాల్లోకి వస్తున్నా... మొత్తం 234 స్థానాల్లో పోటీ: రజనీకాంత్ సంచలన ప్రకటన

  • రాజకీయ అరంగేట్రంపై రజనీ కీలక ప్రకటన
  • యుద్ధం చేస్తున్నా
  • గెలుపు, ఓటమిలను నిర్ణయించేది భగవంతుడే
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని చెప్పారు. యుద్ధం చేయబోతున్నానని... గెలుపు, ఓటమి భగవంతుడి చేతిలోనే ఉందని తెలిపారు. తనకు రాజకీయాలంటే భయం లేదని, మీడియా అంటేనే భయమని చెప్పారు.

రాజకీయాల్లో గెలిస్తే విజయమని... లేదంటే విరమణ అని చెప్పారు. కాలమే తన రాజకీయ అరంగేట్రాన్ని నిర్ణయించిందని అన్నారు. అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం చివరి రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాజకీయ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు. రజనీ ప్రకటనతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటప ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.
rajani kanth
rajani kanth political entry

More Telugu News