Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అమెరికా ట్రిప్ కేన్సిల్ చేసుకున్న హన్సిక 
  • రామ్ చరణ్ సరసన కైరా అద్వాని 
  • న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకున్న బన్నీ
*  అందాల హన్సిక ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకలను అమెరికాలో తన స్నేహితులతో కలసి మాంచి హుషారుగా జరుపుకుంటూ వుంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం అమెరికా వెళ్లడం లేదట. ఇటీవల ఈ చిన్నది తమిళంలో బాగా బిజీ అయింది. ఆయా సినిమాల షూటింగులలో పాల్గొనాల్సి ఉన్నందునే అమ్మడు అమెరికా ట్రిప్ కేన్సిల్ చేసుకుందని సమాచారం.  
*  రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వాని కథానాయికగా నటించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందే చిత్రం కోసం కైరా అద్వానీని బుక్ చేసినట్టు తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తోంది.
*  'నా పేరే సూర్య' చిత్రం షూటింగ్ నుంచి హీరో అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. నూతన సంవత్సర ఆగమనాన్ని కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవడానికి నాలుగు రోజుల సెలవు తీసుకున్నాడు. తిరిగి జనవరి నాలుగు నుంచి షూటింగులో పాల్గొంటాడు.  
Hansika
Raviteja
Ramcharan
Allu Arjun

More Telugu News