Pawan Kalyan: ముందుగా పవన్ పుట్టి.. ఆ తర్వాతే ఎమోషన్స్ పుట్టాయి!: పవర్‌ స్టార్‌పై వర్మ తాజా వ్యాఖ్యలు

  • అమితాబ్, రజనీకాంత్ కూడా ఆయన ముందు దిగదుడుపే
  • బ్రూస్‌లీకి పవన్ మొగుడులా ఉన్నాడు
  • నేనైతే పవన్‌నే  పెళ్లాడుతా
  • పవన్‌పై వర్మ ప్రశంసలు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోమారు సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశాడు. వర్మ తన తాజా పోస్టులో పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. పవన్ ముందు పుట్టాడా? ఎమోషన్ ముందు పుట్టిందా? అనేది చెట్టు ముందా? విత్తు ముందా? కోడి ముందా? గుడ్డు ముందా? అనే అనాది ప్రశ్నకు సమాధానం చెబుతానని పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ ముందు పుట్టి ఇప్పుడు మనందరికీ ఎమోషన్స్ నేర్పుతున్నాడని, ‘హ్యాట్సాప్ పీకే’ అని పేర్కొన్నాడు.

మరో పోస్టులో.. తన గత జన్మలో కూడా ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదని, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లు కూడా పవన్ ముందు పనికిరారని రాసుకొచ్చాడు. బ్రూస్‌లీకి పవన్ మొగుడులా ఉన్నాడని పేర్కొన్నాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రపంచంలోని అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి, అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌లో ఉన్న పవన్‌ను మరో పక్కన పెడితే తాను పవన్‌నే పెళ్లాడతానని పేర్కొన్నాడు. 
Pawan Kalyan
Ram gopal varma
Tollywood
Director

More Telugu News