dhanush: యాక్షన్ డ్రామా మూవీ దర్శకుడిగా ధనుష్ .. ఆగస్టులో సెట్స్ పైకి!

  • హీరోగా .. నిర్మాతగా బిజీగా వున్న ధనుష్ 
  • దర్శకుడిగా మరో సినిమా చేసేందుకు సిద్ధం 
  • భారీ తారాగణం .. భారీ బడ్జెట్    
కోలీవుడ్ లో కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే హీరోలలో ధనుష్ ఒకరిగా కనిపిస్తాడు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా .. దర్శకుడిగా రచయితగా .. సింగర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. 'పా పాండి' సినిమా ఆయనలోని దర్శక ప్రతిభకు అద్దం పట్టింది. అందువలన శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు తమ బ్యానర్ పై ఒక సినిమా చేసి పెట్టమని ఆయనను కోరినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 ఇది భారీ యాక్షన్ డ్రామా నేపథ్యంతో కూడిన చిత్రమనేది తాజా సమాచారం. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి ధనుష్ దర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తాడా? హీరోగా కూడా చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 2018 ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, 2019 సమ్మర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.   
dhanush

More Telugu News