Chandrababu: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీ చేస్తా: బాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీ చేస్తానని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి నుంచి హిందూపురం పట్టణానికి నిర్మించనున్న వాటర్ పైపులైన్ పనులకు బాలకృష్ణ ఈరోజు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పైపులైన్ నిర్మాణం ద్వారా హిందూపురం పట్టణ వాసులకు మంచినీటి ఎద్దడి తొలగిపోయే అవకాశముందని అన్నారు. పేద, బడుగులు, రైతులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా 106 మంది రైతులకు ‘రైతు రథం’ ట్రాక్టర్లను, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. రైతులతో కలిసి బాలయ్య కూడా ట్రాక్టర్ నడిపి వారిని ఉత్సాహపరిచారు.
Go Back to Shorts
Chandrababu
Balakrishna

More Telugu News