adilabad: ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియో.. యువకుల ఫిర్యాదు.. యువ‌తి అరెస్ట్‌!

  • ఇటీవ‌ల‌ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసీల ఆందోళ‌న‌
  • ఆ ఆందోళ‌న గురించి వ్యాఖ్య‌లు చేసిన 22 ఏళ్ల‌ యువ‌తి
  • సోషల్‌ మీడియాలో పోస్ట్
  • కేసు న‌మోదు చేసిన పోలీసులు

 ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళ‌న గురించి వనపర్తి జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువ‌తి ముదావత్‌ సోను (22) ఒక‌ వర్గాన్ని రెచ్చగొట్టేట్లు వ్యాఖ్య‌లు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో గురించి కొంద‌రు యువ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వీడియోను ప‌రిశీలించిన పోలీసులు ముదావ‌త్ సోనుని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ఆ యువ‌తి రిమాండ్‌లో ఉంది.

More Telugu News