samantha: విశాల్ నాకు పర్ఫెక్ట్ జోడీ: సమంత

  • విజయ్, సూర్యలతో గౌరవమిస్తూ నటించాలి
  • విశాల్ సమ వయస్కుడిలా అనిపిస్తాడు
  • బెస్ట్ కో-స్టార్
కోలీవుడ్ లో తనతో పాటు కలసి నటించిన హీరోల గురించి అక్కినేని వారి కోడలు సమంత సరదా వ్యాఖ్యలు చేసింది. విజయ్, సూర్య వంటి హీరోలతో నటించేటప్పుడు... వారికి గౌరవం ఇస్తూ నటించాల్సి వచ్చేదని చెప్పింది. కానీ, విశాల్ తో నటించేటప్పుడు మాత్రం తన సమ వయస్కుడితో కలసి నటిస్తున్నట్టే అనిపించిందని తెలిపింది. విశాల్ బెస్ట్ కో-స్టార్ అంటూ కితాబిచ్చింది.

విశాల్, సమంతలు జంటగా నటించిన 'ఇరుంబుతిరై' షూటింగ్ పూర్తయింది. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులతో కలసి సమంత, విశాల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది.
samantha
vishal
vijay
suriya

More Telugu News