Kurnool: ప్రత్యర్థులంతా ఉపసంహరణ... కేఈ ప్రభాకర్ ఎన్నిక ఏకగ్రీవమే!

  • నామినేషన్ ను ఉపసంహరించుకున్న బైరెడ్డి అనుచరుడు 
  • స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న మిగతా వారు కూడా
  • సాయంత్రంలోగా కేఈ ఎన్నికపై ప్రకటన!
కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయనకు పోటీగా నామినేషన్లు వేసిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు జయప్రకాశ్ రెడ్డి సహా మిగతా అందరూ తమ తమ రాజీనామాలను ఈ ఉదయం ఉపసంహరించుకున్నారు. దీంతో కేఈ ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. జయప్రకాశ్ సహా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న మిగతావారూ తాము అభ్యర్థులుగా వైదొలగుతున్నట్టు ఎన్నికల అధికారికి పత్రాలను అందించారు. దీంతో ఈ సాయంత్రంలోగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటిస్తారని సమాచారం. కాగా, తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించిన బైరెడ్డి, చంద్రబాబుతో చర్చించిన తరువాత కేఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమమైంది.
Kurnool
MLC Election
KE Prabhakar

More Telugu News