manchu lakshmi: వెబ్ సిరీస్ దిశగా మంచు లక్ష్మి .. నాగ్ ను ఒప్పించే ప్రయత్నం!

  • వెబ్ సిరీస్ లకు పెరుగుతోన్న ఆదరణ 
  • వెబ్ సిరీస్ నిర్మాణం వైపుకు మంచు లక్ష్మి 
  • దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్  
వెబ్ సిరీస్ కి ఆదరణ పెరుగుతూ ఉండటంతో .. ఆ దిశగా దృష్టి పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే కొంతమంది వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఉంటే .. మరొకొందరు వాటిలో నటిస్తున్నారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో వెంకటేశ్ .. రానా నటించడానికి అంగీకరించారంటే, వెబ్ సిరీస్ లకి గల క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి కూడా ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసిందని సమాచారం. 12 నుంచి 15 ఎపిసోడ్స్ వరకూ వుండే ఈ వెబ్ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నాగార్జున చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, మంచు లక్ష్మి ఈ కాన్సెప్ట్ ను నాగార్జునకు చెప్పిందట. ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా బిజీగా వున్న నాగార్జున వెబ్ సిరీస్ లో చేస్తాడా? అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నాగార్జున చేయనని అంటే, సుమంత్ తో చేసే ఆలోచనలో మంచు లక్ష్మి ఉందనే టాక్ వినిపిస్తోంది. 
manchu lakshmi
nagarjuna

More Telugu News