hero dhanush: ధనుష్ నా కొడుకే.. ఈ విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు!: కదిరేశన్

  • తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలన్న రజనీ
  • ధనుష్ కు ఆ మాట చెప్పాలన్న కదిరేశన్
  • తమ కుమారుడిని పంపించాలంటూ వేడుకోలు
కోలీవుడ్ యంగ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన కుమారుడేనంటూ కదిరేశన్ అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయంపై మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ధనుష్ తన కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ తన అభిమానులతో సమావేశాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్న సమయంలో... కదిరేశన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ధనుష్ తన కుమారుడేనంటూ మేలూరు కోర్టులో కదిరేశన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి ధనుష్ స్టే తెచ్చుకుని, ఆ తర్వాత కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. మరోవైపు, తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటూ తన అభిమానులకు రజనీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రజనీ పిలుపుపై కదిరేశన్ స్పందించారు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, రజనీకి ఓ లేఖ పంపుతున్నట్టు తెలిపారు. ఆ లేఖను మీడియాకు కూడా చూపించారు.

తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఉందని, తమ కుమారుడు తమకు అండగా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని తమ కుమారుడు అయిన ధనుష్ కు కూడా చెప్పాలని, తమ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన లేఖను చూసిన తర్వాతైనా రజనీ ఆ పని చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
hero dhanush
rajanikanth
dhanush father

More Telugu News