shoib aktar: ఆ బాలీవుడ్ నటి అంటే నాకు చాలా ఇష్టం.. కిడ్నాప్ చేద్దామనుకున్నా!: షోయబ్ అక్తర్

  • సోనాలీ బింద్రే అంటే చచ్చేంత ఇష్టం
  • నా పర్సులో ఆమె ఫొటో ఎప్పుడూ ఉండేది
  • ఇంత వరకు కలవలేక పోయా
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రచండమైన వేగంతో బంతులను విసురుతూ, ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్లకు దడ పుట్టించాడు షోయబ్. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన వెల్లడించాడు. బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే అంటే షోయబ్ కు చచ్చేంత ఇష్టం అట. ఎంత ఇష్టం అంటే... తన పర్సులో సోనాలీ ఫొటో ఎప్పుడూ ఉండేదట. ఆమెను ఓ సారి కలిసి, తన ప్రేమను వెల్లడిద్దామని అనుకున్నాడట. అంతేకాదు, ఒకవేళ తన ప్రేమను ఆమె తిరస్కరిస్తే... కిడ్నాప్ చేయాలని కూడా అనుకున్నాడట. కానీ, ఇంత వరకు ఆమెను ఒక్కసారి కూడా కలవలేకపోయానని చెప్పుకొచ్చాడు షోయబ్.
shoib aktar
sonali bendre

More Telugu News