sushma swaraj: పాక్‌లో కుల్‌భూష‌ణ్ త‌ల్లి, భార్య‌కు జ‌రిగిన అవ‌మానం వివ‌రిస్తూ సుష్మా స్వ‌రాజ్ క‌న్నీరు!

  • పాక్ వెళ్లిన భారత నేవీ మాజీ అధికారి త‌ల్లి, భార్య‌ల‌కు అవ‌మానంపై సుష్మా
  • లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ సుష్మా ఉద్విగ్నం
  • సాకులు చూపుతూ పాక్ క్రూర ప్ర‌వ‌ర్తన‌
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను చూడడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన అతడి కుటుంబసభ్యులకు అవమానం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో ప్రకటన కూడా చేశారు. కాగా, పాకిస్థాన్ తీరును వివరిస్తూ సుష్మస్వరాజ్ ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్నారు.

 భద్రతా కారణాలు అంటూ సాకులు చూపుతూ పాక్ క్రూరంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఆమె చెప్పారు. ఒకవేళ భ‌ద్ర‌తా కార‌ణాలే వారి ఉద్దేశం అయితే కుల్‌భూష‌న్ జాద‌వ్ త‌ల్లి, భార్య చెప్పులు తీసుకున్న పాక్ వారు తిరిగి వెళ్లేటప్పుడు ఇచ్చేసి ఉండేద‌ని, కానీ పాక్‌ అలా చేయలేద‌ని అన్నారు.         
sushma swaraj
tears
kulbhushan jadav

More Telugu News