Vanita: విజయ్ సెల్ఫీ వీడియో చూపుతూ వనితపై ప్రశ్నల పరంపర!

  • వనితారెడ్డిపై పోలీసుల ప్రశ్నల వర్షం
  • విజయ్ ఆరోపణలపై కూపీ లాగుతున్న పోలీసులు
  • సమాధానాలను దాటవేస్తున్న వనితారెడ్డి
నటుడు విజయ్ ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన ఆయన భార్య వనితారెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు విజయ్, ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీ వీడియోలో వనితపై పలు ఆరోపణలు చేయగా, వాటన్నింటినీ వినిపిస్తూ, ఒక్కోదాని గురించి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తొలుత సాధారణ ప్రశ్నలను మాత్రమే సంధించిన పోలీసులు, ఇప్పుడామెను మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలకు వనిత సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సమాధానాలు చెప్పకుంటే, అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించగా, తన తప్పేమీ లేదని, విజయ్ తనపై ఎందుకు ఆరోపణలు చేశాడో అర్థం కావడం లేదని ఆమె పాత పాటే పాడినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Vanita
Vijay
Selfi Video
Sucide

More Telugu News