delhi model gang rape: ఢిల్లీలో దారుణం.. నటిపై గ్యాంగ్ రేప్!

షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. కట్టుదిట్టమైన చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ... మహిళల మానాలకు రక్షణే లేకుండా పోతోంది. తాజాగా, పలు టీవీ సీరియళ్లలో నటించిన ఓ మోడల్ (23) గ్యాంగ్ రేప్ కు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ కు చెందిన సదరు యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చింది. ఇదే సమయంలో పలు సీరియళ్లలో కూడా చిన్నిచిన్ని పాత్రలు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు ఆమెను కలిసి, సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలికారు. ముంబైలో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తున్నారని... నేరుగా ఆయనతోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వారి మాటలను సదరు మోడల్ నమ్మింది. ఈ క్రమంలో డిసెంబర్ 25న ఆమెను వీరు ముగ్గురూ ఓ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారు. అనంతరం, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత, జరిగిన ఘటన గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామాంధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కాసేపటికే వారు విడుదల అయ్యారు. దీంతో, వారి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధితురాలు భయాందోళనలు వ్యక్తం చేసింది. మరోవైపు, నిందితులు ముగ్గుర్నీ బెయిల్ పైనే విడుదల చేశామని... కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
delhi model gang rape

More Telugu News