Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం  కేజీ సత్రం వద్ద బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితులను మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి మైసూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది వరకు ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Accident
Andhra Pradesh
Chittoor

More Telugu News