Pawan Kalyan: ‘కొడకా..’ అంటూ పాట అందుకుని.. అంతలోనే పగలబడి నవ్విన ప‌వ‌న్ కల్యాణ్‌!

  • ‘కొడకా కోటేశ్వరరావు...’ సాంగ్ టీజర్ విడుదల
  • ‘పవన్ కల్యాణ్ సార్! అంత ఈజీగా ఏమీ తెమలనీయరు..’ 
  • పాట పాడే సమయంలో అక్కడున్న వాళ్ల మాటలు
‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఐదు పాటల ఆడియో ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రంలో ఆరో పాట ‘కొడకా కోటేశ్వరరావు’ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా పాడుతున్నాడు. ఈ పాటకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ టీజర్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, పాటల రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు అనిరుథ్ తదితరులు ఉన్నారు.

‘కొడకా..’ అంటూ పాటను మొదలపెట్టబోయే ముందు పవన్ పడిపడి నవ్వడం, ‘పవన్ కల్యాణ్ సార్ అంత ఈజీగా ఏమీ తెమలనీయరు. అది నాకు అర్థమవుతోంది’ అని భాస్కరభట్ల అనడం మనకు స్పష్టంగా వినపడుతుంది. కాగా, ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. 
Pawan Kalyan
agnyatavasi

More Telugu News