Amitabh Bachchan: ముంబై రిసెప్షన్: అనుష్క శర్మ, అమితాబ్ పరస్పర నమస్కారాలు.. నవ్వులు పూయించిన వైనం!

  • కోహ్లీ జంట రిసెప్షన్ కు హాజరైన బిగ్ బీ
  • తన తల వంచి మరీ అమితాబ్ నమస్కారం
  • మరింత వినమ్రంగా అనుష్క ప్రతినమస్కారం
విరాట్ కోహ్లీ- అనుష్క జంట నిన్న ముంబైలో ఇచ్చిన రిసెప్షన్ కు క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ నట దిగ్గజాలు హాజరయ్యారు. ముంబైలోని రెగిస్ హోటల్ లో  ఎంతో గ్రాండ్ గా నిన్న జరిగిన ఈ రిసెప్షన్ కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. విరాట్ - అనుష్క జంటను అభినందించేందుకు వారి వద్దకు అమితాబ్ వెళ్లారు.

అమితాబ్, అనుష్క శర్మ పరస్పర నమస్కారాలు చేసుకున్నారు. అమితాబ్ తన తల వంచి మరీ నమస్కారం చేయగా, అనుష్క మరింత వినమ్రంగా బిగ్ బీకి నమస్కరిస్తూ నవ్వులు చిందించింది. ఇదంతా చూస్తున్న అతిథులు నవ్వులు కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమితాబ్ తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచారు.  
Amitabh Bachchan
Virat Kohli

More Telugu News