ram gopal varma: ‘రక్తచరిత్ర’లో వాస్తవాలు చూపించలేదు: మద్దెల చెరువు సూరి సోదరి గంగుల హేమలత

  • వాస్తవంగా జరిగిందొకటి..‘రక్తచరిత్ర’ సినిమాలో చెప్పింది మరొకటి
  • గంగుల కుటుంబం గురించి చూపించినవన్నీ వాస్తవాలు కాదు
  • సినిమాకు తగ్గట్టుగా కథ మార్చుకున్నారు: హేమలత
‘రక్తచరిత్ర’ సినిమాలో చూపించినట్టుగా మా కుటుంబాలకు చెందిన వారి ఇళ్లన్నీ ఎదురెదురుగా ఏమీ లేవని మద్దెలచెరువు సూరి చెల్లెలు గంగుల హేమలతారెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘రక్తచరిత్ర సినిమా రెండు భాగాలు చూశాను. వాస్తవంగా జరిగింది వేరు, ఆ సినిమాలో చూపించింది వేరు. ఈ సినిమాలో గంగుల కుటుంబం గురించి చూపించినవన్నీ వాస్తవాలు కాదు. సినిమాకు తగ్గట్టుగా కథ మార్చుకున్నారు కానీ, వాస్తవాలు చూపించలేదు’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గతంలో విడుదలైన సినిమా ‘రక్తచరిత్ర’.  
ram gopal varma
gangula

More Telugu News