chiranheevi: 'సైరా'లో నయనతార చేయడం డౌటే అంటున్నారు!

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • ఇంతవరకూ డేట్స్ ఇవ్వని నయన్ 
  • మరో హీరోయిన్ తో సంప్రదింపులు    
చిరంజీవి కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో 'సైరా' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నయనతార నటించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండవ షెడ్యూల్ లో నయనతార కాంబినేషన్లోని సీన్స్ వున్నాయట.

 అయితే ఇంతవరకూ ఆమె తన డేట్స్ ను ఖరారు చేయడం లేదట. ఈ విషయంపై దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెతో సంప్రదించినా, ఆమె పెద్దగా రియాక్ట్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. నయనతార ఇలా ఎటూ తేల్చకుండా ఆలస్యం చేస్తుండటంతో, చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా సమస్య లేకుండగా ఉండటం కోసం మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నయనతార చేయడం డౌటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
chiranheevi
nayanatara

More Telugu News