ramnath kovind: అమరావతిలో రాష్ట్రపతి కోసం పసందైన విందు.. కోవింద్ శాకాహారి, ఆయన భార్య మాంసాహారి.. మెనూ ఇదే

  • అమరావతి పర్యటనకు రాష్ట్రపతి
  • రాష్ట్రపతికి నోరూరించే వంటకాలు సిద్ధం
  • ఆంధ్ర వంటకాలను రుచి చూపించనున్న చంద్రబాబు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు ఏపీ రాజధాని అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు పసందైన వంటకాలను ఏపీ ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఆంధ్ర వంటకాలు, స్వీట్లు ఈ విందులో నోరూరించనున్నాయి. ఈ విందు రాష్ట్రపతికి మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

వీరికోసం ప్రత్యేకంగా అరకు కాఫీని తెప్పిస్తున్నారు. మరోవైపు కోవింద్ శాకాహారి కాగా, ఆయన సతీమణి సవిత మాత్రం మాంసాహారి కావడం గమనార్హం. విందు సమయంలో ఏపీకి సంబంధించిన క్లాసికల్ మ్యూజిక్ ను సిద్ధం చేయించారు. విందులో అన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే ఉండనున్నాయి.  

విందులో మెనూ ఇదే...

స్వీట్స్: పూతరేకులు, షుగర్ ఫ్రీ జున్ను, బొబ్బట్లు, ఆవు నేతి అరిసెలు, కాకినాడ కాజా, జిలేబీ.
సూప్స్: వెజ్, నాన్ వెజ్ కు సంబంధించి టామ్ యామ్, ధనియా షోర్వా.
సలాడ్స్: రెయిన్ బో సలాడ్ విత్ హనీ, ఆలుచానా, గ్రీన్ సలాడ్.
నాన్ వెజ్: మటర్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, రొయ్యల ఇగురు, కడాయ్ రొయ్య, నాటు కోడి కూర, కోనసీమ ఫ్రైడ్ ఫిష్, తవా ఫిష్, ఎగ్ కర్రీ.
వెజ్: ఆంధ్ర వెజ్ పలావ్, కట్ మిర్చి బిర్యానీ, కొబ్బరి చట్నీ, బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, పన్నీర్ కాలీ మిర్చి, పన్నీర్ టిక్కా మసాలా, మష్రూమ్ కర్రీ, బగారా బెగాన్, రాయలసీమ రాగి సంకటి, మేతి చమాన్, మిక్స్ డ్ రైతా, పప్పుచారు, ఉలవచారు, పచ్చళ్లు, కుండ పెరుగు.

వీటితో పాటు స్వీట్ పాన్, హాట్ పాన్, కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ వుంటాయి.
ramnath kovind
kovind amaravati visit
Chandrababu
amaravati

More Telugu News