bangalore: అనంతకుమార్ హెగ్డే నాలుక కత్తిరించిన వారికి నజరానా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు!

షార్ట్స్‌లో చూడండి
దేశ ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్న తరుణంలో వారి మధ్య విద్వేషాలు రగిలేలా వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర మంత్రి, ఉత్తరాఖండ్ ఎంపీ అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానంటూ కర్నాటకలోని కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పటేదార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓట్ల కోసం అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే, తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. భారత రాజ్యాంగాన్ని అనంతకుమార్ హెగ్డే విమర్శిస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారెవరైనా దేశద్రోహుల కిందకే వస్తారని, హెగ్డేపై ప్రధాని మోదీ తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Go Back to Shorts
bangalore
Narendra Modi

More Telugu News