Telugudesam: 2019 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం: కేఈ కృష్ణమూర్తి

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీచేయకపోవడం దివాళకోరుతనమే
  • రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతే
  • మీడియాతో టీడీపీ నేత కేఈ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఏపీ టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావించారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.  
Telugudesam
ke

More Telugu News