allu arjun: కొత్త దర్శకుడికి టెస్ట్ పెట్టిన అల్లు అర్జున్

షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ ప్రస్తుతం 'నా పేరు సూర్య' సినిమా చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ దశలో వుంది. ఈ సినిమా తరువాత వి.ఐ.ఆనంద్ తో బన్నీ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరో నూతన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

అనూ రెడ్డి అనే యువకుడు బన్నీని కలుసుకుని ఒక కథ వినిపించాడట. తానే దర్శకత్వం చేస్తానని అన్నాడట. దాంతో కొన్ని సీన్స్ షూట్ చేసి తనకి చూపించమని చెప్పి .. అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా బన్నీనే చేశాడట. దాంతో ఆ కుర్రాడు ఇతర పాత్రధారులతో టెస్ట్ షూట్ చేస్తున్నాడని అంటున్నారు. అనూ రెడ్డి చేసిన సీన్స్ నచ్చితే మాత్రం ఆయనతో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో బన్నీ వున్నాడని చెబుతున్నారు. మరి బన్నీని ఒప్పించడంలో అనూ రెడ్డి ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.
Go Back to Shorts
allu arjun

More Telugu News