జర భద్రం! న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల గురి!
- కొత్త సంవత్సర వేడుకలపై ఉగ్రవాదుల కన్ను
- అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు
- విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
కొత్త సంవత్సర వేడుకలతోపాటు పండుగ సీజన్ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఈ మేరకు సమాచారం అందిందని బీసీఏఎస్ చీఫ్ రాజేశ్ కుమార్ చంద్ర తెలిపారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విమానాశ్రయాల్లో, ముఖ్యంగా టెర్మినల్ బిల్డింగ్ లోపల అప్రమత్తంగా ఉండాలని, లోపలికి ప్రవేశించే వారిపై ఓ కన్ను వేయాలని బీసీఏఎస్ సూచించింది. కారు పార్కింగ్ ప్రదేశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, కారు బాంబులతో దాడికి దిగే అవకాశం ఉండడంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పేర్కొంది. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరింది.